Saturday, November 23, 2024

ప్రాంతీయ పార్టీ స్థాయికి కాంగ్రెస్‌: దేవెగౌడ

జాతీయ స్థాయిలో బలమైన సెక్యులర్‌ కూటమి అవసరమని జేడీఎస్‌ అగ్రనేత దేవెగౌడ పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా భావసారూప్య ప్రాంతీయ పార్టీన్నీ ఏకం కావాలని కోరారు. ఈ కూటమిలోకి కాంగ్రెస్‌ కూడా వస్తే బాగుంటుందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదన్నారు. ప్రాంతీయ పార్టీమాదిరిగా తయారైందని, కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని విమర్శించారు. కాంగ్రెస్‌ అత్యంత బలహీనం అయినందున, ప్రాంతీయ పార్టీలన్నీ కూటమిగా ఏర్పాటు కావాలని, అందులో కాంగ్రెస్‌ కూడా ఉండాలన్నారు. పంజాబ్‌లో ఉన్న అంతర్గత పోరు వల్లే కాంగ్రెస్‌ ఘోరంగా ఫలితాలను చవిచూడాల్సి వచ్చిందని దేవెగౌడ అన్నారు.

నేతలందర్నీ ఏకతాటిపైకి నడిపించడంలో నాయకత్వం విఫలమైందని విశ్లేషించారు. 2013లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో ముందస్తు పొత్తు అవకాశాలను ఆయన కొట్టిపారేసారు. ప్రస్తుతం తమ పార్టీకి 28 సీట్లున్నాయని, వచ్చే ఎన్నికల్లో ఈ సంఖ్యను 100 దాటించడమే తక్షణ కర్యవ్యమన్నారు. త్వరలో బెంగళూరులో భారీ సభ ఏర్పాటు చేస్తున్నామని, ఈ వేదికపై నుంచి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement