Tuesday, November 26, 2024

జూన్​ 1న దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సమ్మేళనాలు​.. రెండు రోజులపాటు నిర్వహించాలని నిర్ణయం

ఉదయ్‌పూర్‌లోని నవ్ సంకల్ప్ చింతన్ శివిర్ తదుపరి ప్రణాళికలో భాగంగా వ్యూహంపై చర్చించడానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు , ఇన్‌ఛార్జ్ లు ఇవ్వాల (బుధవారం) భేటీ అయ్యారు.  కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, ఇతర ఇన్‌చార్జ్ లు జూన్ 1 నుండి దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు రాష్ట్ర సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు. గత ఆదివారం ముగిసిన ఉదయపూర్ మూడు రోజుల చింతన్ శివిర్‌కి ఇది కొనసాగింపుగా ఉండనుంది.

 మేధోమథనం సెషన్‌లో కాంగ్రెస్‌ను సమయానుకూలంగా పునర్నిర్మించడం, రాజకీయంగా ఎలా సమస్యలను పరిష్కరించాలి, ప్రజల్లోకి ఎలా వెళ్లాలి అనే మార్గాలను కనుగొనడానికి పలు రకాల చర్చలు జరిగాయి. రాబోయే ఎన్నికల సవాళ్లకు సిద్ధం కావడంపై పార్టీ పెద్ద ఎత్తున దృష్టి సారించింది. ఇక.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) ఆమోదించిన జాబితా ప్రకారం.. భవిష్యత్తులో ఎలా పని చేయాలో.. పార్టీ స్వభావాన్ని మార్చడానికి.. తగిన ప్లాన్ చేయడానికి వ్యూహాన్ని రూపొందిస్తున్నారు. రాష్ట్ర సమ్మేళనానికి, రాష్ట్ర , జిల్లా స్థాయి కాంగ్రెస్ అధికారులందరూ హాజరుకానున్నారు. జూన్ 11న జిల్లా స్థాయిలో ఒకరోజు క్యాంపు ఉండనుంది.. ఆగస్టు 9 నుంచి 15 వరకు ప్రతి జిల్లా యూనిట్ మూడు రోజుల పాటు పాదయాత్ర నిర్వహించాలని ప్లాన్​ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement