Wednesday, November 20, 2024

14న కాంగ్రెస్‌ టాస్క్‌ఫోర్స్‌ భేటీ, 2024 సార్వత్రిక ఎన్నికలపై సమీక్ష.. ఖర్గే ఆధ్వర్యంలో తొలి సమావేశం

కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌గా మల్లికార్జన్‌ ఖర్గే నేతృత్వంలో తొలిసారి కీలక భేటీ జరగనుంది. 2024 లోక్‌సభ ఎన్నికలపై చర్చించేందుకు సోమవారం పార్టీ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ భేటీ అవుతోంది. ఖర్గే అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత ఇదే మొదటి కీలక సమావేశం. ఎన్నికల వ్యూహ బృందంలోని సభ్యులు టాస్క్‌ఫోర్స్‌ పనితీరు, ఎన్నికల ప్రణాళిక గురించి కొత్త అధ్యక్షుడికి తెలియజేస్తారు. ఈ టాస్క్‌ఫోర్స్‌ బృందంలో చిదంబరం, ముకుల్‌ వాస్నిక్‌, జైరాం రమేష్‌, కేసీ వేణుగోపాల్‌, అజయ్‌ మాకెన్‌, రణదీప్‌ సూర్జేవాలా, ప్రియాంక గాంధీ, కె సునీల్‌ తదితరులు ఉన్నారు. ఏప్రిల్‌లో ఉదయ్‌పూర్‌లో మూడు రోజుల సమావేశం జరిగింది.

ఈ క్రమంలో 2024జాతీయ ఎన్నికలకు ముందు రాజకీయ సవాళ్లను పరిష్కరించడానికి ఎంపవర్డ్‌ యాక్షన్‌ గ్రూప్‌ని కాంగ్రెస్‌ ప్రకటించింది. పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ 2024 టాస్క్‌ను రూపొందించారు. ఎనిమిది మంది సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటైంది.

కాంగ్రెస్‌ పునర్నిర్మాణం..

పార్టీ అధ్యక్ష ఎన్నికలలో మల్లికార్జున్‌ ఖర్గే గెలుపొందారు. మునుపటి సార్వత్రిక ఎన్నికల్లో వైఫల్యం తర్వాత రాహుల్‌ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడం.. 2019లో సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టడం జరిగింది. ఆ తర్వాత అసెంబ్లిd ఎన్నికల్లో వరుస పరాజయాల నేపథ్యంలో పార్టీలో మార్పులు జరిగాయి. పునర్నిర్మాణానికి జీ23 నేతల డిమాండ్‌కు అనుగుణంగా సంస్కరణలు మొదలయ్యాయి. ఖర్గే ముందు ఇప్పుడున్న సవాళ్లలో గుజరాత్‌ అసెంబ్లిd ఎన్నికలు ఒకటి. సుదీర్ఘంగా అధికారంలో కొనసాగుతున్న బీజేపీని గద్దె దించడంలో కొత్త నాయకత్వం ఏమేరకు విజయవంతం అవుతుందన్నది ఆసక్తిగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement