Tuesday, November 26, 2024

PM Modi : కాంగ్రెస్ అప్న‌నంగా క‌చ్చ‌తీవును శ్రీ‌లంక‌కు ఇచ్చింది… మోదీ ట్వీట్‌…

కచ్చతీవు దీవులను కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు అప్పనంగా ఇచ్చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. దేశ ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ పార్టీని నమ్మలేమని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ట్వీట్ చేశారు.

- Advertisement -

ఈ దీవుల యాజమాన్య హక్కుల కోసం జరుగుతున్న గొడవకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు 1974లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అప్పటి తమిళనాడు సీఎం కరుణానిధికి ఈ విషయం చెప్పి, కచ్చతీవు దీవులను శ్రీలంకకు కట్టబెట్టారని ఆరోపించారు. ఆర్టీఐ దరఖాస్తుతో ఈ విషయం తాజాగా బయటపడిందని చెప్పారు. ఇది తెలిసిన ప్రతీ భారతీయుడు కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాడని అన్నారు.

భారతదేశ ఐకమత్యాన్ని, సమగ్రతతను, ప్రయోజనాలను 75 ఏళ్లుగా కాంగ్రెస్ దూరం చేస్తూనే ఉందన్నారు. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేసిన ఆర్టీఐ దరఖాస్తుతో కచ్చతీవు దీవుల విషయం వెలుగులోకి వచ్చింది. 1974 జూన్ లో కచ్చతీవు దీవులపై పూర్తి హక్కులను శ్రీలంకకు అప్పగిస్తున్నట్లు అప్పటి తమిళనాడు సీఎం కరుణానిధికి విదేశాంగ శాఖ కార్యదర్శి కేవల్ సింగ్ సమాచారం అందించినట్లు వెల్లడైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement