రాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగా బరిలో ఉన్న గిరిజన మహిళ ద్రౌపది ముర్మును దుష్ట సిద్ధాంతాలకు ప్రతినిధిగా పేర్కొంటూ కాంగ్రెస్ నేత అజోయ్ కుమార్ చేసిన విమర్శలపై బీజేపీ మండిపడింది. శతాధిక పార్టీ కాంగ్రెస్ కువిమర్శలు మానుకుని తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ద్రౌపది ముర్మ ఆదివాసీ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని, కింది స్థాయినుంచి ఎదిగిన మహిళ అని, ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని ఉన్నత స్థాయికి ఎదిగారని, అలాంటి వ్యక్తిపై విమర్శలు చేయడమంటే అవమానించడమేనని బీజేపీ అధికార ప్రతినిది షెహ్జాద్ పూనావాలా అన్నారు.
ఉత్తమ ఎమ్మెల్యేగా అవార్డు పొందిన ఆమెపై ఇప్పటివరకు అవినీతి మచ్చ పడలేదని, అలాంటి ఉత్తమ రాజకీయ నేతలో ఉన్న చెడు ఏమిటని ఆయన ప్రశ్నించారు. ద్రౌపది ముర్ము దేశ ఆదివాసీల ప్రతినిధి కాదని, దేశంలో అత్యంత దుష్ట సిద్ధాంతాలకు ప్రతినిధి అంటూ అజోయ్ కుమార్ మంగళవారంనాడు ట్విట్టర్లో విమర్శించడంతో బీజేపీ ప్రతివిమర్శలు చేస్తూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.