Sunday, September 29, 2024

ఎమ్మెల్సీ పోరులో రాములు నాయక్ ఎలిమినేషన్

తెలంగాణ లో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల ఓట్ల లెక్కింపు నాలుగో రోజు కొనసాగుతోంది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానం ఓట్ల లెక్కింపును హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరుగుతుండగా, వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ స్థానం ఓట్ల లెక్కింపును నల్లగొండలోని ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో నిర్వహించనున్నారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటివరకు 67వ అభ్యర్థి రాములు నాయక్ ఎలిమినేషన్ అయ్యారు. ఓట్ల బదలాయింపు అనంతరం ఓట్ల వారీగా టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 1180 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 1750 ఓట్లు, కోదండరాంకు 2362 ఓట్లు వచ్చాయి.

ప్రస్తుతం టిఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి 25 వేల ఓట్ల ఆధిక్యం లో కొనసాగుతున్నారు. రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఈ రోజు సాయంత్రానికి పూర్తి కావచ్చని.. రాత్రి కి అంతిమ ఫలితం ప్రకటించే అవకాశం ఉంది.

రెండో స్థానంలో మల్లన్న, మూడో స్థానంలో ప్రొ. కోదండరామ్‌ ఉన్నారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మొత్తం లక్షా 17 వేల 386 ఓట్లు రాగా..మల్లన్నకు 91,858 ఓట్లు, ప్రొ. కోదండరామ్‌కు 79, 110 ఓట్లు పోల్‌ అయ్యాయి. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పల్లాకు మెజారిటీ తగ్గింది. పోటాపోటీగా దూసుకుపోతున్నారు మల్లన్న, కోదండరాం. రెండో ప్రాధాన్యత ఓట్లలో.. పల్లాకు 6586 ఓట్లు రాగా… మల్లన్నకు 8563 ఓట్లు, కోదండంరాంకు 9038 వచ్చాయి. మల్లన్న కంటే 475 ఓట్లు ఎక్కువ సాధించారు కోదండరాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement