Monday, November 25, 2024

Congress – రాయ్ బరేలీ, వయనాడ్‌లో రాహుల్ ఆధిక్యం


ప‌దేండ్ల త‌ర్వాత 100 సీట్లు దాటిన కాంగ్రెస్‌
పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు
స్వీట్లు పంచుకుని, సంబురాలు చేసుకున్న కేడ‌ర్‌

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈసారి తాను పోటీ చేసిన రెండు సీట్లు రాయ్ బరేలీ, వయనాడ్ లోనూ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ రాయ్ బరేలీ, వయనాడ్ లోనూ రాహుల్ ఆధిక్యం కొనసాగుతోంది. రాహుల్ ప్రత్యర్దులుగా ఉన్న బీజేపీ, కమ్యూనిస్టు అభ్యర్ధులు ఆయనతో పోలిస్తే చాలా దూరంగా ఉన్నారు. దీంతో రాహుల్ గాంధీ ఈ రెండు సీట్లలోనూ భారీ ఆధిక్యంలో గెలిచే అవకాశాలున్నాయి. వ‌యనాడ్‌లో ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాహుల్ తొలి రౌండ్ లో 103 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయిన రాయ్‌బరేలీలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో బీజేపీ ప్రత్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్ కంటే రాహుల్ ముందంజలో ఉన్నారు. వయనాడ్‌లో బీజేపీ అభ్యర్థి, కేరళలో ఆ పార్టీ అధినేత కే సురేంద్రన్‌పై రాహుల్ గాంధీ పోటీ పడుతున్నారు. వయనాడ్ స్ధానంలో రాహుల్ పై సీపీఐ సీనియర్ నేత అన్నీ రాజాను రంగంలోకి దింపింది.వీరిద్దరి కంటే రాహుల్ ముందంజలో ఉన్నారు.

ప‌దేండ్ల త‌ర్వాత కాంగ్రెస్ దూకుడు..

- Advertisement -

మరోవైపు దేశంలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈసారి 100 సీట్ల మార్కును దాటింది. ఇవాళ వెలువడుతున్న లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 100కు పైగా సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో 2014 తర్వాత కాంగ్రెస్ అత్యధిక స్ధానాలు సాధించినట్లు లెక్క. కేంద్రంలో 2014లో అధికారం కోల్పోయాక కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ దూకుడు ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే మొత్తం మీద బీజేపీతో పోలిస్తే వెనుకంజలోనే ఉంది. కాగా, కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొన‌సాగ‌డం.. ఎక్కువ సీట్లు గెలుచుకునే అవ‌కాశాలు ఉండ‌డంతో కాంగ్రెస్ శ్రేణులు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి. స్వీట్లు పంచుకుని సంబురాల్లో మునిగి తేలారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement