Monday, September 16, 2024

Congress | రెండు స్థానాల్లోనూ రాహుల్ గాంధీ విజ‌యం…

  • వ‌య‌నాడ్, రాయ‌బ‌రేలీలోనూ ఏకంగా 3.50 ల‌క్ష‌ల మెజార్టీ.
  • సోనియా కంటే అధిక మెజార్టీ సాథించిన నేత..

కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తాను పోటీ చేసిన రెండు స్థానాలలో విజయం సాధించారు. కేరళలోని వయనాడ్ నుంచి రెండోసారి గెలిచారు. సమీప సీపీఐ అభ్యర్థి యానీ రాజాపై 3.5 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి 3.7 లక్షల మెజార్టీతో గెలిచారు.

ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ గత రికార్డులను బద్ధలు కొట్టారు. రాహుల్ గాంధీ తన సమీప బీజేపీ ప్రత్యర్థిపై 3.70 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజ‌యం సాధించారు.

రాయబరేలి నియోజకవర్గానికి 2004 నుంచి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో ఇక్కడి నుంచి 1.67 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అయితే ఈసారి లోక్‌సభ ఎన్నికల దూరంగా ఉంటున్నట్టు ప్రకటిస్తూ ఆమె రాజ్యసభకు వెళ్లారు. దీంతో రాయబరేలి నుంచి రాహుల్ ఎన్నికల బరిలోకి దిగారు.

తన కుమారుడిని రాయబరేలి ప్రజలకు అప్పగిస్తున్నానని, తనను ఆదరించినట్టే తన కుమారుడిని కూడా ఆశీర్వదించాలని ఇటీవల రాయబరేలిలో జరిగిన ర్యాలీలో సోనియాంగాధీ ప్రజలకు అప్పీల్ చేశారు. ప్రజల ఆశలను రాహుల్ ఏమాత్రం నిరాశపరచని భరోసా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement