లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ప్రధాని మోదీ రాజస్థాన్‌లో పర్యటించారు. టోంక్-సవాయి మాధోపూర్‌లో జరిగిన సమావేశంలో ప్రధాని మోడీ. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జమ్మూ, కాశ్మీర్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే.. నేటికి అక్కడ జవాన్లపై రాళ్ల దాడులు జరిగేవని అన్నారు.
ప్రజలు మెచ్చిన బీజేపీ పార్టీ సరిహద్దులో అధికారంలో ఉంది కాబట్టి ప్రస్తుతం అక్కడ సుస్థిరతను తీసుకు వచ్చిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే మన సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు అయ్యేది కాదని.. దేశంలో బాంబు పేలుళ్లు జరిగేవని.. రాజస్థాన్ వరుస పేలుళ్ల నిందితులను కాంగ్రెస్ కాపాడి పాపానికి పాల్పడిందని అన్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉంటే అవినీతికి కొత్త మార్గాలు వెతుక్కునేదని.. కాంగ్రెస్ హయాంలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలు రాజస్థాన్ నెంబర్ 1 స్థానంలో ఉందని విమర్శించారు. అలాగే తనకు దేశ ప్రజలందరి ప్రేమ, ఆశీస్సులు, ఉత్సాహం లభించాయని ప్రధాని మోదీ అన్నారు. “ఈ రోజు హనుమాన్ జయంతి శుభ సందర్భం, ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ప్రధాని మోడీ తెలిపారు.