తిరుపతి ఉపఎన్నికకు ఒక్కో పార్టీ తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా చింతా మోహన్ పేరును ప్రకటించింది. గతంలో ఎంపీగా, కేంద్ర మంత్రిగా చింతా మోహన్ తన సేవలు అందించారు. అయితే ఇటీవల చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలు మీడియా వర్గాల్లో సంచలనం రేపాయి. ఏపీ రాజధానిగా తిరుపతి అవుతుందని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పారని చింతా మోహన్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రాష్ట్ర విభజనకు కారణం దివంగత నేత వైఎస్ఆర్ అని కూడా చెప్పారు. విజయభాస్కర్ రెడ్డి గద్దె దింపేందుకు వైఎస్ఆర్ ఆనాడు తెలంగాణ ఉద్యమానికి నాంది పలికారని ఆరోపించారు. కాగా తిరుపతి ఉపఎన్నిక కోసం బీజేపీ కూడా తమ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ రత్నప్రభ పేరును గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Advertisement
తాజా వార్తలు
Advertisement