Saturday, November 23, 2024

TS | దేశం సుభిక్షంగా ఉండాలంటే కాంగ్రెస్ గెలవాలి : ఉపముఖ్యమంత్రి భట్టి

నిర్మల్ ప్రతినిధి (ప్రభ న్యూస్) : దేశం సుభిక్షంగా ఉండాలంటే అన్ని వర్గాల ప్రజల కోసం పాటుపడేది కాంగ్రెస్ పార్టీయేనని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేర్కొన్నారు. నిర్మల్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న బట్టి విక్రమార్క విలేకరుల సమావేశంలో మాట్లాడారు… జిల్లాలో నెలకొన్న పోడు భూముల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడేది కాంగ్రెస్ పార్టీఅని. మరోమారు బీజేపీకి అధికారం ఇస్తే దేశం విచ్చినం కావడం తధ్యమని ఆయన చెప్పారు.

అదిలాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా ఓ పేద మహిళ ఆదివాసి బిడ్డ ఆత్రం సుగుణకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఎన్నిక బరిలో నిలబెట్టిందని.. అందుకు జిల్లాలోని ప్రజలందరూ ఆమెకు మద్దతు పలికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. జిల్లాలో కాంగ్రెస్ హయాంలోనే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించిందని గుర్తు చేశారు. త్రివేణి సంగమం పులిమడుగు పనులను త్వరలోనే ప్రారంభించి పూర్తి చేసి.. నీటిని డిస్ట్రిబ్యూటర్ల ద్వారా పంపిణీ చేస్తామని రైతులకు బాసటగా ఉంటామని పేర్కొన్నారు.

గత ప్రభుత్వం ధరణి తీసుకువచ్చి పేదల భూములను లాక్కున్నారని ధరణిలోని లోటుపోట్లను సరిదిద్దేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని గుర్తు చేశారు. బీఆర్‌‌ఎస్‌, బీజేపీ పార్టీలు కుమ్మక్కై చీకటి రాజకీయం చేస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కులగణన చేయాలని ఉద్దేశం లేదని. కులగలన పూర్తి అయితే ఆ పార్టీకి నూకలు చెల్లుతాయని గుర్తించింది… అందుకే వెనుకడుగు వేస్తుందని ఆరోపించారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క, ఖానాపూర్ శాసనసభ్యులు వేడుమ బొజ్జూ, మాజీ మంత్రి ఆల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి, డిసిసి అధ్యక్షులు కే శ్రీహర్రావు, మాజీ ఎమ్మెల్యేలు రేఖ నాయక్, కోనేరు కోనప్ప తదితర జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement