కరోనా కష్టకాలంలో తెలంగాణలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ప్రైవేట్ ఆస్పత్రులలో ప్రజలకు అవుతున్న ఖర్చు ప్రభుత్వం భరించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో తెలిపారు. ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడు ప్రభుత్వాలు తీసుకున్న విధంగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన మౌలిక సదుపాయాలు లేవని, కోవిడ్ కష్ట కాలంలో గత్యంతరం లేక జనం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారని తెలిపారు. తెలంగాణలోని చాలా ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజలను జలగల్లా పీడిస్తున్నాయని కోమటిరెడ్డి ఆరోపించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement