Sunday, November 10, 2024

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ ఎమ్మెల్యే సీతక్క దీక్ష

ప్రజల ఆరోగ్యం కోసం ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క‌ దీక్ష చేపట్టారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వేలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వాళ్లకు ఉచితంగా వైద్యం అందించేలా కృషి చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. కరోనా వేళ ప్రైవేటు ఆసుప‌త్రులు ప్ర‌జ‌ల‌ను పీల్చి పిప్పి చేస్తున్నాయ‌న్న ఆరోప‌ణ‌లు బ‌లంగా వినిపిస్తున్నాయని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. క‌రోనా చికిత్స‌లో పేద‌ల‌కు న్యాయం జ‌ర‌గాలంటే క‌రోనాను వెంట‌నే ఆరోగ్యశ్రీ‌లో చేర్చాల‌ని డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా కరోనా బాధితులకు ఉచితంగా వైద్య చికిత్స డిమాండ్ చేస్తూ సీతక్క దీక్షకు దిగారు. ప్రజల సౌకర్యార్థం ఉచిత అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేయాలని కోరారు. ఇప్ప‌టికే క‌రోనా చికిత్స తీసుకున్న అర్హులంద‌రికీ సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆసుప‌త్రుల బిల్లులు తిరిగి చెల్లించాల‌ని సీత‌క్క ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర NSUI నేత బ‌ల‌మౌర్ వెంక‌ట్‌తో క‌లిసి సీత‌క్క ఈ ప్ర‌జారోగ్య దీక్ష చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement