Friday, November 22, 2024

హాత్ సే హాత్ జోడో యాత్ర‌తో కాంగ్రెస్ నేత‌లు పార్టీ గాడిలో ప‌డిన‌ట్లేనా…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు గాడిలో పడ్డారా..? వచ్చే ఎన్నికల్లో అధికారం ‘చే’జిక్కించుకోవడానికి నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు తాత్కాలికంగా పక్కన పెట్టారా..? అనే చర్చ కాంగ్రెస్‌ వర్గాల్లో జోరుగా చర్చ జరుగు తోంది. పార్టీ అధిష్టానం మందలింపుతో నాయకులందరు హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ యాత్రలతో పేరుతో తాత్కా లికంగా విభేదాలను పక్కన పెట్టి ఐక్యతారాగం వినిపిస్తు న్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో నాయకుల మధ్య అంతర్గత విభేదాలు, అసంతృప్తులు, ఒకరిపై మరొకరు విమ ర్శలు చేసుకోవడం సహజం. టీ పీపీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్నాక అవి మరింత పెరిగాయి. సీనియర్లు, జూనియర్లుగా కాంగ్రెస్‌ నాయకులు విడిపోయారు. ఆ సమ యంలోనే ప్రకటించిన టీ పీసీసీ కార్య వర్గ కూర్పుతో పార్టీ నాయకుల మధ్య నెలకొన్న వివాదం మరింత పెరిగింది. దీంతో రాష్ట్ర కాంగ్రెస్‌ నాయ కత్వం రెండుగా చీలిపోయిందనే ప్రచా రం కూడా జరిగింది. వెంటనే పార్టీ అధిష్టానం జోక్యం చేసు కోవడంతో నాయకుల మధ్య నెలకొన్న వివాదం తాత్కా లికంగా సమిసి పోయి నట్లుగానే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ రాష్ట్ర వ్యవ హారాల ఇన్‌చార్జ్‌ బాధ్యతలను పార్టీ సీనియర్‌ నేత, మహా రాష్ట్రకు చెందిన మాజీ మంత్రి మాణిక్‌రావు ఠాక్రేకు అప్ప గించాక.. సీనియర్‌ నేతలు గాడిలో పడ్డారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఠాక్రే వచ్చాక పార్టీ సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో సమావేశమై.. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి అనుసరించా ల్సిన వ్యూహాలేంటని అంశాలపై చర్చించారు. అంతే కాకుండా నాయకుల మధ్య ఏమైనా విభేదాలు, సమస్యలుంటే పార్టీ అంతర్గత సమా వేశా ల్లోనే మాట్లాడాలని, చర్చించి పరిష్క రించుకోవాలని, లేదం టే పార్టీ పరంగా క్రమ శిక్షణ చర్యలు తప్పవని హెచ్చ రికలు చేయడంతో నాయకులందరు ప్రస్తు తానికి మౌనంగానే ఉం టున్నారని చర్చ జరుగుతోంది. దీంతో పార్టీ నాయకుల్లో కూడా కొంత మేర మార్పు వచ్చిం దనే టాక్‌ వినిపిస్తోంది. నాయకుల మధ్య సఖ్యత లేకపోవ డంతో బీఆర్‌ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగు తోందని, తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్‌ వైపు మల్లడం కష్టమనే అభిప్రాయం పార్టీ నేతలు గ్రహించారని చెబుతు న్నారు.

తెలంగాణ ఇచ్చిన పార్టీకి చెప్పుకుంటున్న ప్పటికి ఇప్పటికే రెండు పర్యాయాలు అధికారానికి దూరమైనా మనే భావనతో కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు. ఎన్నికలకు మరో ఎని మిది నెలల సమయం ఉన్నం దు.. ప్రజలకు ఐక్యంగా ఉన్నా మనే సంకేతాలు ఇవ్వాలని లేదంటే .. పార్టీకి వచ్చే ఎన్నికల్లో తీరని నష్టం జరుగుతుందనే అంచనాకు వచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు కొనసాగింపుగా అన్ని రాష్ట్రాల్లో హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ పేరుతో పాదయాత్రలు చేయాలని ఏఐసీసీ అదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణలో కూడా టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ నెల 6 నుంచి పాదయాత్రను మొదలు పెట్టారు. మొదట్లో రేవంత్‌రెడ్డి పాదయాత్రకు అధిష్టానం అనుమతి లేదని, రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరు తమ సొంత నియోజక వర్గాల్లో యాత్రలు చేపట్టాలని వాదనను కొంత మంది సీనియర్లు తెరపైకి తీసు కొచ్చారు. దీంతో పార్టీలో కొంత గందరగోం కూడా నెల కొన్న ది. వెంటనే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్‌ రావు ఠాక్రే రంగంలోకి దిగి.. నాయకుల మధ్య నెలకొన్న అసమ్మతి, అసంతృప్తులకు చెక్‌ పెట్టే విధంగా వ్యవహారిం చారు. నాయ కులందరూ ఎవరికి వారుగా తమ, తమ నియోజక వర్గాల్లో పాదయాత్రలు చేయాలని, టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమమార్క, ఇతర సీనియర్లు రాష్ట్రంలో ఏదో ఒక చోట యాత్రల్లో పాల్గొంటారని సూచించారు.

ఇదే అంశాన్ని ఒక అవకాశంగా తీసుకున్న టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ పేరుతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ములుగు నుంచి పాదయాత్రకు శ్రీకారకం చుట్టి..రెండు నెలల పాటు జనంలో ఉండే విధంగా ప్లాన్‌ చేసుకుని ముందుకు సాగుతున్నారు. రేవంత్‌రెడ్డి పాదయాత్రకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు, మాజీ మంత్రి జానారెడ్డితో పాటు ఇతర సీనియర్లు కూడా హాజరై సంఘీభావం చెప్పడం పార్టీ నేతల్లో మార్పు రావడంతో పాటు పార్టీ కేడర్‌లో కూడా నూతన జోష్‌ వచ్చిందనే చర్చ జరుగుతోంది.

మరి కొందరు నాయకులు కూడా తమ సొంత నియోజక వర్గాల్లో యాత్రల్లో ఉండటం వల్ల హాజరుకాలేదని, సమ యాన్ని బట్టి పాదయాత్రలో జాయిన్‌ అవుతారని పార్టీకి చెం దిన ఒక సీనియర్‌ నేత అభిప్రాయపడ్డారు. తమకు ముందు పార్టీ ముఖ్యమని, ప్రస్తుతానికి విభేదాలను పక్కన పెట్టి పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తామని, అందుకే రేవంత్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రలో భాగస్వామ్యం అవు తున్నట్లు మరొక సీనియర్‌ నేత అభిప్రాయపడ్డారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల ముం దు కు బలంగా తీసుకెళ్లితే తమకు అధికారం రావడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement