రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో దేశంలో భారత్ బంద్ కొనసాగుతున్నది. తెలంగాణలో ప్రభుత్వం ఈ బంద్‌కు మద్దతు ఇవ్వకపోవడంతో ప్రతిపక్షాలు విమర్శించడం మొదలుపెట్టాయి. కేసీఆర్, మోడీ ఇద్దరూ ఒకటే అని, అందుకే ప్రభుత్వం భారత్ బంద్‌కు మద్దతు ఇవ్వడంలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ గుర్రపు బగ్గీపై అసెంబ్లీకి వచ్చారు. అయితే, అసెంబ్లీ గేటు నుంచి లోనికి గుర్రపు బగ్గీని అనుమతించాలని పోలీసులకు కోరారు. దీనిక పోలీసులు అనుమతించలేదు. నేతలు వాగ్వాదానికి దిగడంతో భట్టి, శ్రీధర్‌బాబు, సీతక్క, జీవన్‌రెడ్డి లను అరెస్ట్ చేశారు. వీరిని బేగంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉదయం నుంచి భారీ వర్షంలోనూ నేతలు భారత్ బంద్‌ను నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ, లెఫ్ట్ పార్టీలు, జనసమితి తదితర పార్టీలు రైతు చట్టాలకు మద్దతుగా రోడ్డుపైకి వచ్చిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: ఏపీ సర్కారుపై మరోసారి పవన్ ఆరోపణలు.. సేవ్ ఫ్రమ్ ఏపీ అంటూ ట్వీట్