Tuesday, November 26, 2024

కరోనా కట్టడికి ప్రభుత్వం విఫలం: రాహుల్ గాంధీ

దేశంలో కరోనా వైరస్ ఉధృతి ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కరోనా మొదటి వేవ్ కి సెకండ్ వేవ్ కి ఎంతో సమయం ఉన్నప్పటికి ప్రభుత్వం ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించారు రాహుల్ గాంధీ. ప్రభుత్వ యంత్రాంగం కరోనాపై చేతులెత్తేసిందని, ఈ సమయంలో ప్రజలను ఆదుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. ఈ సంక్షోభ సమయంలో దేశానికి భాధ్యతాయుతమైన పౌరుల అవసరం ఎంతో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ సహచరులు అన్ని రాజకీయపరమైన కార్యకలాపాలను వదిలేసి ప్రజాసేవకు ఉపక్రమించాలని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దేశ ప్రజలకు సంపూర్ణ సహకారం అందిస్తూ వారి బాధను తగ్గించే ప్రయత్నం చేయాలని సూచించారు. ఇది కాంగ్రెస్ కుటుంబ విద్యుక్త ధర్మం అని స్పష్టం చేశారు.


Advertisement

తాజా వార్తలు

Advertisement