Thursday, November 7, 2024

రాహుల్ గాంధీతో విపక్ష నేతల భేటీ.. తెలుగు రాష్ట్రాల నేతలకు అందని ఆహ్వానం

ఢిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో విప‌క్ష పార్టీలకు చెందిన పలువురు నేత‌లు స‌మావేశమ‌య్యారు. ఈ సందర్భంగా పార్ల‌మెంటు స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహం స‌హా ప‌లు అంశాల‌పై వారు కీల‌క చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఈ స‌మావేశంలో కాంగ్రెస్‌తో పాటు ఎన్సీపీ, శివ‌సేన‌, ఆర్జేడీ, స‌మాజ్ వాదీ పార్టీ, సీపీఐ, సీపీఎం, ఆర్ఎస్పీ, నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్‌, టీఎంసీ, ఎల్జేడీ నేత‌లు పాల్గొన్నారు. అయితే ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలు వైసీపీ, టీడీపీ నేతలకు ఆహ్వానం అందకపోవడం గమనార్హం.

కాగా ఈ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ… విప‌క్షాలు ఐక్యంగా ఉండాల‌ని చెప్పారు. ప్ర‌జ‌ల త‌ర‌ఫున గ‌ళాన్ని వినిపించే వారు ఎంత ఐక్యంగా ఉంటారో అంత బ‌లంగా ప్ర‌జావ్య‌తిరేక చ‌ర్య‌ల‌ను అడ్డుకోవ‌చ్చ‌ని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ప్ర‌భుత్వ తీరుకి వ్య‌తిరేకంగా పోరాడాల‌ని చెప్పారు. ఈ భేటీలో పెగాస‌స్, కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన నూత‌న సాగు చ‌ట్టాలు వంటి ప‌లు అంశాల‌పై కూడా నేత‌లు చ‌ర్చిస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: కర్రసాములో ఇరగదీసిన పవన్ తనయుడు అకిరానందన్

Advertisement

తాజా వార్తలు

Advertisement