తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకం వల్ల సమాజంలో ఇతరుల దృష్టిలో దళితులపై ఈర్ష భావం పెరుగుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గడిచిన ఏడేళ్ళలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం కరీంనగర్ జిల్లా ధర్మపురి పట్టణంలోని ఎస్సీ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించారని ఆరోపించారు. దళిత బంధు పథకం మేడిపండు వంటిదని తెలిపారు. దళిత ఎమ్మెల్యేలకు మంత్రి పదవుల కోసం పోరాడాల్సిన బాధ్యత.. దళిత మంత్రిగా ఈశ్వర్‌పైనే ఉందని జీవన్ రెడ్డి సూచించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement