తెలంగాణ పీసీసీ చీఫ్ రేసులో తాను ఇప్పటికీ ఉన్నానని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. తనకూ అవకాశం ఇవ్వాలంటూ సోనియా, రాహుల్‌గాంధీలను కోరుతున్నానని, అయితే ఢిల్లీకి వెళ్లి తనకు పీసీసీ చీఫ్ ఇవ్వాలని అడిగే పరిస్థితి ప్రస్తుతం లేదని చెప్పుకొచ్చారు. ప్రజలు ఇప్పుడు కరోనా టెన్షన్లో ఉన్నారని, పీసీసీపై ఇప్పుడు చర్చ ఎందుకొచ్చిందో తెలియదన్నారు. అధిష్ఠానం కొత్త పీసీసీ చీఫ్‌ను నియమించాలని భావిస్తే తాము ఆపబోమని.. కానీ, సీనియర్ల అభిప్రాయాలను సేకరించిన తర్వాతే నియామకం చేపడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. ప్రజా సమస్యలకు ఎలాంటి మెడిసిన్ వేయాలో తనకు తెలుసని, అందుకే పీసీసీ చీఫ్ పోస్టును అడుగుతున్నానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తనను కాకుండా వేరే ఎవరినైనా పీసీసీ చీఫ్‌గా నియమించినా.. కట్టుబడి ఉంటామని అన్నారు. తనకు నచ్చిన వ్యక్తి పీసీసీ చీఫ్ అయితే రాష్ట్రమంతా తిరుగుతానని, లేదంటే తన నియోజకవర్గానికి పరిమితమవుతానని జగ్గారెడ్డి తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement