దేశంలో కరోనా ఉదృతి అధికంగా ఉన్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రతి రోజు ఇక్కడ అత్యధిక సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే హాస్పిటల్స్ అన్ని కరోనా రోగులతో నిండిపోయాయి. దీంతో ఆస్పత్రుల్లో బెడ్ల కొరత తీవ్రమవుతోంది. ఢిల్లీ, యూపీ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో బెడ్ల కొరత ఏర్పడింది. దీంతో రోగులకు చికిత్స అందించడం కష్టం అవుతోంది. ఓవైపు టీకాలు లేక ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు బెడ్లు ఖాళీ కూడా అందుబాటులో లేక సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ఓ కేంద్ర మంత్రి సోదరుడికి కూడా బెడ్లు దొరకని పరిస్థితి నెలకొంది. కేంద్ర మంత్రి అయ్యి ఉండి కూడా తమ కుంటుంబ సభ్యులకు బెడ్లు లేకపోవడంపై కాంగ్రెస్ అశ్చర్యం వ్యక్తం చేసింది. కావాలంటే తాము సహాయం చేస్తామని, బెడ్లు అందిచేందుకు కృషి చేస్తామంటూ కాంగ్రెస్ నేత బీ వీ శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement