ఇజ్రాయిల్‌కు చెందిన పెగాసస్ స్పైవేర్ కారణంగా ప్రముఖుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురవుతున్నాయి. పెగాసస్ హ్యాకింగ్ నివేదికపై సోమవారం నాడు పార్లమెంట్‌లోనూ దుమారం చెలరేగింది. అయితే ఆ స్పైర్‌వేర్‌తో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్, కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌లను కూడా కొందరు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
హ్యాక్ అయిన డేటాబేస్‌లో సుమారు 300 మంది భారతీయుల ఫోన్ నెంబర్లు ఉన్నాయి. దాంట్లో 40 మంది జర్నలిస్టులు కూడా ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. 2018 నుంచి 2019 మధ్య పెగాసస్ స్పైవేర్‌తో వాళ్లను టార్గెట్ చేసినట్లు ఓ నివేదికలో తేలింది. 2019 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆ హ్యాకింగ్ తతంగం సాగినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ, స్టాలిన్ గెలుపుల్లో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ ఫోన్ కూడా హ్యాకైనట్లు తెలుస్తోంది. ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్ఎస్వో కంపెనీ పెగాసస్ స్పైవేర్‌ను విక్రయిస్తోంది.
ఈ వార్త కూడా చదవండి: గత ఐదేళ్లలో 326 రాజద్రోహం కేసులు నమోదు