Saturday, November 23, 2024

TG | ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్‌ ఖూనీ చేస్తోంది : హరీష్‌ రావు

శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ గా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పీఏసీగా అరికెపూడి గాంధీని నియమించడంపై బీఆర్ ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు. ప్రధాన ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్ పదవి ఎలా ఇస్తారని…. కాంగ్రెస్ కండువా కప్పుకున్న అరికెపూడి గాంధీకి ఆ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు రాహుల్‌గాంధీకి లేదని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement