కాంగ్రెస్ విద్వేష విధానం బయటపడిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. లోక్ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ… రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాని సమాధానమిచ్చారు. రాహుల్ గాంధీ తీరుపై ప్రధాని మోడీ విమర్శించారు. కొంతమంది ఉపయోగిస్తున్న భాష సరిగా లేదన్నారు. కొంత మంది రాష్ట్రపతిని అవమానించారన్నారు. నిన్నటి రాహుల్ ప్రసంగంపై కొందరు సంబరాలు చేసుకుంటున్నారన్నారు. నిన్న ఓ పెద్ద నాయకుడు రాష్ట్రపతిని విమర్శించారన్నారు. నేతల వ్యాఖ్యలు వారి మనసులోని ద్వేషాన్ని బయటపెట్టాయన్నారు. దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాలు దేశ భవిష్యత్ కు పునాది అన్నారు. దేశంలో అవినీతిని తరిమికొట్టామన్నారు. ఎన్నికలే జీవితం కాదన్నారు. ఆర్థికాభివృద్ధిలో భారత్ ప్రపంచంలో ఐదో స్థానంలో ఉందన్నారు. పొరుగు దేశాల్లో పరిస్థితి భయంకరంగా ఉందన్నారు. అనేక దేశాల్లో ధరలు ఆకాశాన్నంటాయన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement