Tuesday, November 19, 2024

TG | హామీల అమ‌ల్లో కాంగ్రెస్ విఫ‌లం : హ‌రీశ్ రావు

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నీటి మూటలను తలపిస్తున్నాయ‌ని హరీశ్ రావు అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లపై రాసిచ్చిన కాంగ్రెస్ పార్టీ 191 రోజులు గడిచినా అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.

పొరుగు రాష్ట్రం ఏపీలో అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని రకాల పింఛన్లు పెంచారు. మ‌రోవైపు ఒరిస్సా ముఖ్యమంత్రికి వరి కనీస మద్దతు ధర రూ. 3100గా నిర్ణయించారు అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా వృద్ధులు, వితంతువులకు 4వేలు, వికలాంగులకు 6వేలు పింఛన్లు పెంచేలా తక్షణమే నిర్ణయం తీసుకోవాలి, అదేవిధంగా ఎన్నికల హామీలో చెప్పినట్లుగా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement