కడెం, డిసెంబర్ 14 (ఆంధ్రప్రభ) : రాష్ట్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు శనివారం కడెం మండలంలో 22 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్న గంగాపూర్ -ఎర్వచింతల్ వంతెన నిర్మాణ పనులకు రాష్ట్ర మంత్రి సీతక్క ఖానాపూర్, ఎమ్మెల్యే వేడమ బొజ్జు, ఎమ్మెల్సీ దండే విట్టల్ లు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు.
ఈసందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ… మారుమూల గ్రామాలు అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. మారుమూల గ్రామాల్లో రోడ్లు, వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఖానాపూర్ నియోజకవర్గం కడెం, ఖానాపూర్ మండలాల సరిహద్దును ఆదివాసీ గిరిజన ప్రజలకు వ్యయ ప్రయాసల దూరం తగ్గించి విద్య, వైద్యం కోసం పేద ప్రజలు త్వరగా చేరుకునేలా గంగపూర్ నుండి ఎర్వ చింతల్ గ్రామానికి కలుపు వంతెన 22 కోట్ల 15 లక్షల రూపాయల వ్యయంతో పై వంతెన నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ డి.విఠల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బోజ్జు మాట్లాడుతూ… ఖానాపూర్ నియోజకవర్గంలోని కడెం, ఖానాపూర్ మండలాల్లోని మారుమూల ఆదివాసీ గిరిజన గ్రామాలకు నిత్యావసర రోడ్డు మార్గమని, వారు ఎన్నో దశాబ్ధాల కల, నిరీక్షణకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో తెరపడుతుందన్నారు.
ఈకార్యక్రమంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష, అభినవ్, నిర్మల్ డీఆర్డీఓ విజయలక్ష్మి, నిర్మల్ ఆర్డీఓ రత్న కళ్యాణి, నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు కే శ్రీహరిరావు, కడం తహసీల్దార్ సుజాత రెడ్డి, ఎంపీడీఓ అరుణ, పీఆర్ ఈఈ శంకరయ్య, కాంగ్రెస్ నాయకులు సతీష్ రెడ్డి, బి.రమేష్, యమ్ మల్లేష్ యాదవ్, పి.భూషణ్, పి.శ్రీనివాసరెడ్డి, ముస్కు రాజేందర్ రెడ్డి, ఆకుల లచ్చన్న, గంగాపూర్ మాజీ ఎంపీటీసీ ఎం దాసు నాయక్, కడెం మాజీ ఎంపీపీ బి.చక్రపాణి, మాజీ సర్పంచులు ఏ.శాంత చంద్రహాస్, సదర్ లాల్ ఊర్వతి భీం బాయి, ఆనంద్ రావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.