18వ లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికైన అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. లోక్‌సభ స్పీకర్ ప్రజల గొంతుకకు మధ్యవర్తి అని, గతం కన్నా ఈ సారి ప్రతిపక్ష ఆ స్వరానికి ప్రాతినిధ్యం వహిస్తుందని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు స్పీకర్ పని చేయడంలో సహకరిస్తాయని, సభ పనిచేయాలని కోరుకుంటున్నామని అన్నారు. సభలో ప్రతిపక్షాల స్వరాన్ని అనుమతించాలని అన్నారు. ప్రతిపక్షాలకు ప్రభుత్వం సహకరించాలన్నారు. ప్రభుత్వానికి ఎక్కువ రాజకీయ అధికారం ఉందని అలాగే ప్రతిపక్షం కూడా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుందని గుర్తు చేశారు.
ప్రతిపక్షాల వాణి ఎంతవరకు వినిపిస్తుందో ఈ సభలో స్పీకర్ నిర్ణయిస్తారని, అయితే రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి దేశ ప్రజలు కట్టుబడి ఉన్నారని ఈ ఎన్నికలు రుజువు చేశాయన్నారు. ప్రజల మద్దతుతో తాము పార్లమెంటులో పూర్తిగా ప్రాతినిధ్యం వహిస్తామని.. వారి రాజ్యాంగ హక్కులను పరిరక్షించడానికి పోరాడుతూనే ఉంటామని రాహుల్ గాంధీ చెప్పారు. ఇదే సందర్భంగా తమ విఫక్షాలకు మాట్లాడేందుకు తగిన అవకాశాలు కల్పించాలని కొత్త స్పీకర్ ఓం బిర్లాను కోరారు..