ఇండిపెండెన్స్ డే సందర్భంగా పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్విట్టర్ డీపీ ఫొటోపై బెంగాల్ కాంగ్రెస్ మంగళవారం మండి పడింది. దేశ మొట్టమొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఫొటోను ఉద్దేశ్యపూర్వకంగా తొలగించి గాంధీ, పలువురు ఆజాదీ నాయకుల ఫొటోను సీఎం మమతాబెనర్జీ డీపీగా పెట్టారు. సీఎం మమతాబెనర్జీ ట్విట్టర్ డీపికి కౌంటర్‌గా కాంగ్రెస్ రీట్వీట్ చేసింది.భారత తొలి ప్రధాని నెహ్రూను మీ గురువు నరేంద్రమోడీ, మీరు చరిత్రలో మినహాయించలేరు.
జవహర్‌లాల్ నెహ్రూ దేశ మొదటి ప్రధాని హోదాలో చేసిన మొదటి ఉపన్యాసం విధితో ప్రయత్నించుకు స్కెచ్ వేసిన వ్యక్తి కుమార్తె నేడు దేశ మొదటి ప్రధాని నెహ్రూ ఫొటోను మినహాయించి ట్విట్టర్ డీపీ ఫొటో పెట్టడంపై, తన కుమార్తెకు చరిత్రలో కనీస పాఠాలు గురించి కూడా తెలియదని, ఆమె హిస్టరీ పాఠాలు చదవాలని ఆమె తండ్రి భావిస్తారని కాంగ్రెస్ రీట్వీట్ చేసింది. కర్నాటకలో సైతం బీజేపీ ప్రభుత్వం విడుదల చేసిన ఇండిపెండెన్స్ డే ప్రకటనలో స్వాతంత్య్ర సమరయోధుల జాబితాలో నెహ్రూను తప్పించింది. దీనిపై కర్నాటక కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. మాజీ సీఎం సిద్ధరామయ్య బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస ట్వీట్లు చేశారు.