Monday, November 25, 2024

నేడు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ నిర‌స‌న‌లు..

యూపీలోని ల‌ఖీంపూర్ ఖేరీ ఘ‌ట‌న‌కు నిర‌స‌న‌గా దేశ‌వ్యాప్తంగా ఈ రోజు క‌లెక్ట‌రేట్ల వ‌ద్ద నిర‌స‌న‌లు తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతున్న‌ది. ఈరోజు ఉద‌యం నుంచి అన్ని రాష్ట్రాల్లోని క‌లెక్ట‌రేట్ కార్యాల‌యాల వద్ధ కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు నిర‌స‌న‌లు చేయాల‌ని పిలుపునిచ్చింది.  దీంతో క‌లెక్ట‌రేట్ల వ‌ద్ద పోలీసు బందోబ‌స్తును ఏర్పాటు చేస్తున్నారు.  ఉద‌యం నుంచి క‌లెక్ట‌రేట్ కార్యాల‌యాలకు వెళ్లే దారిలో నిఘాను ఏర్పాటు చేస్తున్నారు.  ల‌ఖీంపూర్ ఖేరీలో రైతులు ఆందోళ‌న‌లు చేస్తున్న స‌మ‌యంలో కేంద్ర‌మంత్రి కుమారుడి కారు వారిపై నుంచి దూసుకుపోయింది.  ఈ ఘ‌ట‌నలో న‌లుగురు రైతులు మృతి చెందారు.  ఆగ్ర‌హించిన రైతులు కాన్వాయ్‌లోని కొన్ని కార్ల‌ను ధ్వంసం చేశారు.  దీంతో ల‌ఖీంపూర్ ఖేరీలో ఉద్రిక్త‌త‌లు చోటుచేసుకున్నాయి. ల‌ఖీంపూర్ ఖేరీ బాధితుల‌ను సంద‌ర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేత‌ల‌ను పోలీసులు అడ్డుకున్నారు.  ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపిన సంగ‌తి తెలిసిందే.  దీంతో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళ‌న‌ల‌కు దిగింది.

ఇది కూడా చదవండి: ఈ రోజు సాయంత్రం బతుకమ్మ పాట విడుదల..

Advertisement

తాజా వార్తలు

Advertisement