డిల్లీ – ఆప్ , సమాజ్ వాదీ పార్టీతో సీట్ల సర్దుబాటు చేసుకున్న కాంగ్రెస్ తాజాగా బెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ తో సైతం ఒప్పందం కుదుర్చుకుంది.. గతంలో బెంగాల్ లో ఒంటరిగానే పోటీ చేస్తామన్న మమతా బెనర్జీ తన పంతాన్ని వీడారు. సీట్ల షేరింగ్ పై చర్చలు తుదిదశకు చేరాయి. బెంగాల్‌లోని 42 సీట్లు ఉన్నాయి. ఆరు స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయాలని భావిస్తోంది. కాగా.. ఐదు సీట్ల వరకు పోటీ చేసేందుకు మమతా అంగీకారం తెలిపింది. దీనికి ప్రతిగా అసోంలో రెండు, మేఘాలయాలో ఒక సీటు ఇవ్వాలని తృణమూల్ కోరింది.. దీనికి రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
బెహ్రాంపూర్, మాల్దా సౌత్, మాల్దా నార్త్, రాయ్‌గంజ్, డార్జిలింగ్, పురులియా ప్రాంతాల్లో కాంగ్రెస్ పోటీ చేయాలని భావిస్తోంది. అయితే పురులియా ఇచ్చేందుకు టీఎంసీకి నో చెప్పింది.. మరో సీటు ఇవ్వాలనే కాంగ్రెస్ ప్రతిపాదనను పరిశీలిస్తామని మమతా బెనర్టీ హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ నేతలు అంటున్నారు..