హైదరాబాద్, ఆంధ్రప్రభ : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుం దని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ పార్టీ తో పొత్తు ఉండదని.. ఒంటరిగానే బరి లోకి దిగుతామని ఆయన పునరుద్ఘా టించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ విష యంలో తన వ్యక్తిగత నిర్ణయాలు ఉండ వని.. అధిష్టానం చెప్పిన చోటే తాను పోటీ చేస్తానని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ బోయినపల్లిలో గాంధీ ఐడియాలజీ కేంద్రం నిర్మాణానికి శంఖుస్థాపన అనంతరం ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. గాంధీ ఐడియాలజీ సెంటర్ కాంగ్రెస్ పార్టీకి దేశ వ్యాప్తంగా ట్రైనింగ్ సెంటర్‌గా మరబోతోందని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. గాంధీజీ ఐడియాలజీ సెంటర్ 365 రోజులు సెంటర్ పని చేస్తుందని, ఎంతో కష్టపడి దీన్ని డెవలప్ చేస్తున్నామని, ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే లీడర్లు ఇక్కడ శిక్షణ తీసుకుంటారని ఆయన తెలిపారు. గాంధీ ఐడియాలజీ సెంటర్ పక్కనే రాష్ట్రపతి నిలయం ఉందని, ఇక్కడి నుంచి 40 నిమిషాల్లో ఏయిర్‌పోర్టుకు వెళ్లడానికి వీలుందని ఆయన వివరించారు. అన్ని రాష్టాలకు చెందిన కాంగ్రెస్ నేతలు ఈ ఐడియాలజీ సెంటర్‌ను వాడుకునే వీలుందని రేవంత్‌రెడ్డి తెలిపారు.
భూమి లాక్కునే ప్రయత్నం చేశారు..
అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ కేంద్రం, వసతి గదుల నిర్మాణం చేయబోతున్నట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే గాంధీ ఐడియాలజీ కేంద్రానికి భూమి ఇచ్చిన వ్యక్తి చనిపోతే.. ఈ భూమిని సర్కార్ లాక్కునే ప్రయత్నం చేసిందని ఆయన ఆరోపించారు. అన్ని రాజకీయ పార్టీలకు భూ కేటాయింపులు జరిగాయని, కాంగ్రెస్‌కే కేటాయింపుల జరగలేదని విమర్శించారు. కంటోన్మెంట్ బోర్డు మీటింగ్‌లో క్యాన్సిల్ చేయాలని అనుకున్నారని.. దానికి కౌంటర్ దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు.
రాజీవ్‌గాంధీ ఆన్లైన్ క్విజ్ పోటీ బ్రోచర్ విడుదల..
యూత్ డిక్లరేషన్‌కు కొనసాగింపుగా రాజీవ్‌గాంధీ ఆన్లైన్ క్విజ్ పోటీ నిర్వహిస్తున్నట్లు టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన బోయినపల్లిలోలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, అస్వార్ విజేత రాహుల్సిప్లిగంజ్తో కలిసి రాజీవ్ గాంధీ యూత్ అన్లైన్ క్విజ్ కాంపిటీషన్ లాంఛింగ్, బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి అస్కార్ అవార్డు విజేత రాహుల్ సిప్లిగంజ్ ముఖ్య అతిధిగా రావడం సంతోషంగా ఉందన్నారు. అస్కార్ అవార్డుతో తెలంగాణకు ఎంతో పేరు తెచ్చిన రాహుల్‌ను కేసీఆర్ ప్రభుత్వం గుర్తించకపోవడం బాధకరమన్నారు. రాజీవ్‌గాంధీ అన్లైన్ క్విజ్ కాంపిటిషన్ విజేతలకు బహుమతి ప్రదానం చేసే కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వస్తారని తెలిపారు. రాహుల్ సిప్లిగంజ్ను కాంగ్రెస్ పార్టీ ఘనంగా సన్మానం చేస్తుందని, పార్టీ తరపున రూ. 10 లక్షల బహుమతి ఇస్తామని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ. 1 కోటి నగదును బహుమతిగా అందజేస్తామని ఆయన తెలిపారు. జూన్ 2న రాజీవ్‌గాంధీ యూత్ అన్లైన్ క్విజ్ కాంపిటిషన్ ఉంటుందని, ఇందులో యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
గెలుపొందిన వారికి బహుమతుల ప్రదానం..
హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ స్ఫూర్తిగా తెలంగాణ యువ శక్తిని మెల్కొలిపే దిశగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే రాజీవ్‌గాంధీ ఐడియాలజీ క్విజ్ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. అసెంబ్లిd నియోజక వర్గాల వారీగా బహుమతులు ఉంటాయన్నారు. ప్రతి అసెంబ్లిd నియోజక వర్గానికి మొదటి బహుమతి ల్యాప్‌టాప్, రెండో బహుమతి స్మార్ట్ ఫోన్, మూడో బహుమతి ట్యాబ్లెట్‌తో పాటు ప్రొత్సాహక బహుమతులు కూడా ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రతి అసెంబ్లిd నియోజక వర్గంలోని మహిళా టాపర్లకు ప్రత్యేక బహుమతి కింది ఎలక్ట్రిక్ స్కూటర్లను అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్ జావెద్, రోహిత్ చౌదరి, టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.