బెంగుళూరు – కర్ణాటక ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అల్లర్లు అంటూ వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ భగ్గుమంది. రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన బీజేపీ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు రణదీప్ సింగ్ సూర్జేవాలా, డాక్టర్ పరమేశ్వర్, డీకే శివకుమార్ బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అమిత్ షా వ్యాఖ్యలపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కోరారు. ఒక సామాన్యుడు చేసి ఉంటే అరెస్ట్ చేసి ఉండేవారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మతకల్లోలాలు జరుగుతాయని కేంద్ర హోంమంత్రి చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. భారత జాతీయ కాంగ్రెస్ ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందన్నారు. అమిత్ షా దేశానికి హోంమంత్రి, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ కాదు అని చెప్పారు. తనపై 20కి పైగా కేసులు పెట్టారని చెప్పారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సింగ్ సూర్జేవాలా మాట్లాడుతూ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశామని చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement