Tuesday, November 19, 2024

తెలంగాణాలో బిఆర్ ఎస్, కేర‌ళ‌లో సిపిఎంతో పొత్తు క‌ల్ల – కాంగ్రెస్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: తెలంగాణలో అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌), కేరళలో సీపీఎంలతో పొత్తు పెట్టు-కునే అవకాశమే లేదని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత, రాహుల్‌ గాంధీ సన్నిహితుడు కేసీ వేణుగోపాల్‌ స్పష్టం చేశారు. అయితే ఎన్నికల తర్వాత పొత్తులు, కొన్ని సందర్భా ల్లో ఎన్నికల ముందు పొత్తులు పెట్టు-కునే అవకాశం ఉంటు-ందని ఆయన తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో సైద్ధాంతిక విభేదాలు ఉన్నా, ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ, ఇతర ప్రాంతీయ పార్టీలతో ఎన్నికల అనంతరం పొత్తులు పెట్టు-కునేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.

కర్ణాటకలో ముఖ్యమంత్రి ఎవరనేదానిపై పార్టీ కసరత్తు చేస్తోందని కేసీ వేణుగోపాల్‌ వెల్లడించారు. డీకే శివకుమార్‌, సిద్ధరామయ్యలతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. ఖర్గే ముఖ్యమంత్రి అవుతారనే వాదనల్ని కొట్టిపారేశారు. పుకార్లను నమ్మవద్ద ని కోరారు. రాజస్థాన్‌లో నాయకత్వ సమస్య ఉందని, పార్టీ దాన్ని పరిష్కరిస్తుం దని అన్నారు. సచిన్‌ పైలట్‌, అశోక్‌ గెహ్లాట్‌ల మధ్య సమస్యలను పరిష్కరిస్తామ ని తెలిపారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగునున్న క్రమంలో దేశ వ్యాప్తంగా మరో ప్రచారానికి ప్లాన్‌ చేస్తున్నట్లు- తెలిపారు. తూర్పు నుంచి పడమరకు ‘భారత్‌ జోడో యాత్ర’ను ప్రారంభిస్తామని తెలిపారు. కర్ణాటక ఎన్నికల విజయంతో కాంగ్రెస్‌ పార్టీ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నట్టు- కనిపిస్తోం ది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌గా భావించిన కర్ణాటకలో అధికారంలోకి రావడంతో కాంగ్రెస్‌ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. రాహుల్‌ గాంధీ ప్రధాని మంత్రి అభ్యర్థిత్వాన్ని ప్రకటించాలని కాంగ్రెస్‌ నాయకులు, శ్రేణులు డిమాండ్‌ చేస్తున్నారు. గత కొన్నాళ్ల నుంచి విజయాల కోసం ఎదురుచూస్తున్న హస్తం పార్టీ ఘన విజయం సాధించడంతో రానున్న ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల ఎన్నికలకు ఆ పార్టీ సమాయత్తం అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement