పంజాబ్ ప్రజలు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని, వారి తీర్పునకు కట్టుబడి ఉంటానని కాంగ్రెస్ పీసీసీ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ అన్నారు. పంజాబ్‌లోని ప్రతీ ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. కొత్త వ్యవస్థను, సరికొత్త మార్పును పంజాబ్ ప్రజలు కోరుకున్నారని చెప్పుకొచ్చారు. ప్రజా తీర్పును అంగీకరిస్తున్నామని, ప్రజాతీర్పు.. భగవంతుడి తీర్పుతో సమానమని తెలిపారు. ప్రతీ ఒక్కరు దీన్ని ఎంతో వినయంతో అంగీకరించాల్సిందే అని చెప్పుకొచ్చారు.
ఓ యోగి ధర్మ యుద్ధంలో ఉన్నప్పుడు తనకు హద్దులు గీసుకోడని, మరణం గురించి భయపడడని, తాను పంజాబ్‌లోనే ఉంటూ.. అభివృద్ధికి సహకరిస్తానన్నారు. పెద్ద లక్ష్యాలను నిర్ణయించుకున్నా అని, గెలుపోటములు గురించి పట్టించుకోవద్దని సూచించారు. తాను సీఎం అభ్యర్థి కానందున పంజాబ్ అంతటా ప్రచారం చేసే అధికారం తనకు లేదన్న సిద్దూ.. ఇది చన్నీ బాధ్యత అంటూ చెప్పుకొచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..