Friday, January 17, 2025

Congrats – గ‌ర్వ‌ప‌డేలా చేశావ్ – కుమార్తె హ‌ర్షారెడ్డికి జ‌గ‌న్ ప్ర‌శంస‌లు

లండ‌న్ – వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , భార‌తి దంప‌తుల చిన్న కుమార్తె వ‌ర్షారెడ్డి లండన్ లోని ప్రతిష్టాత్మక కింగ్స్ కాలేజ్ నుంచి ఎంఎస్సీ ఫైనాన్స్ పట్టా అందుకుంది. ఈ కార్య‌క్ర‌మంలో జ‌గ‌న్ దంప‌తులు స్వ‌యంగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ త‌న ఎక్స్ ఖాతాలో ట్విట్ చేస్తూ, కుమార్తె వర్షారెడ్డిని అభినందిస్తూ.. మేము గర్వపడేలా చేశావు అంటూ అభినందించారు. లండ‌న్ లో ఇద్ద‌రు కుమార్తెల‌తో క‌ల‌సి దిగిన ఫోటోను జ‌గ‌న్ షేర్ చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement