గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అస్త్రాలను రెడీ చేసుకుంది. డిసెంబర్ 1, 5 వ తేదీన రెండు విడతల్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. అయితే.. ఇవ్వాల కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. 182 నియోజకవర్గాలున్న గుజరాత్‌లో ప్రభుత్వ, ప్రైవైటు రంగాల్లో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్ తెలిపింది. అంతేకాకుండా 10లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి హామీలను తన మేనిఫెస్టోలో పొందుపరిచింది.
శనివారం విడుదల చేసిన మేనిఫెస్టోలో మహాకూటమి పార్టీ కూడా నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతితోపాటు దివ్యాంగులు, వితంతువులు, సీనియర్ సిటిజన్లు, నిరుపేదలకు రూ.2,000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఇక.. మహిళలు, మత్స్యకారులకు రూ. 3 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని వెల్లడించింది. రాజస్థాన్ సీఎం, గుజరాత్ ఎన్నికల పరిశీలకుడిగా అశోక్ గెహ్లాట్ వ్యవహరిస్తున్నారు. ఇతర పార్టీ నాయకుల సమక్షంలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇవ్వాల తమ మేనిఫెస్టోను విడుదల చేశారు.
ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధికారంలో ఉన్న గుజరాత్‌లో 182 మంది సభ్యులున్న అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. – డిసెంబర్ 1 , 5 తేదీలలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఈసీ తెలిపింది. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8 న ఉంటుంది.
అంతేకాకుండా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అవినీతి, అక్రమాలను అరికట్టేందుకు కాంగ్రెస్ ప్రత్యేక చట్టం తీసుకువస్తుందని, అలాంటి కేసులను పరిష్కరించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తుందని కూడా కాంగ్రెస్ నేతలు తెలిపారు.