Friday, November 22, 2024

Tamilnadu: కల్తీమద్యం కలకలం.. ఐదుగురు మృతి

తమిళనాడులో మరోసారి కల్తీ మద్యం కలకలం రేపింది. కళ్లకురిచి అనే జిల్లాలో కల్తీ మద్యం తాగడంతో ఐదుగురు మృతి చెందారు. మరో 10మంది ఆస్ప‌త్రి పాలయ్యారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనతో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కల్తీ సారా విక్రయాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కల్తీ మద్యం ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై విచారణ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. మరోవైపు బీజేపీ నేతలు రాష్ట్ర సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎక్సైజ్‌శాఖ మంత్రి ఈ ఘటనకు బాధ్యత తీసుకోవాలని తమిళనాడు బీజేపీ చీఫ్ కే.అన్నమలై డిమాండ్ చేశారు. గతేడాది చెంగలపట్టు జిల్లాలో కూడా 23 మంది కల్తీసారా తాగి మృతిచెందినట్లు గుర్తుచేశారు. రాష్ట్రప్రభుత్వ కల్తీమద్యాన్ని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement