Friday, November 22, 2024

Condolences – జర్నలిజం, సినీ వినోద రంగానికి రామోజీరావు చేసిన సేవలు మరవలేనివి … రాహుల్ గాంధీ

”భారత మీడియా రంగంలో అగ్రగామి, పద్మవిభూషణ్‌ రామోజీరావు మరణం విచారకరం. జర్నలిజం, సినిమా, వినోద రంగానికి ఆయన అందించిన సేవలు చెరగని ముద్ర వేశాయి. మీడియా రూపురేఖలను మార్చాయి. ఈ విచారకర సమయంలో ఆయన కుటుంబం, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా”- అని పేర్కొన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ…

మమతా బెనర్జీ..
”మీడియా లీడర్‌ రామోజీరావు మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. కమ్యూనికేషన్‌ ప్రపంచానికి ముఖ్యంగా తెలుగు మీడియాకు ఆయన దార్శనికుడు. వ్యక్తిగతంగానూ ఆయనతో నాకు మంచి పరిచయం ఉంది. ఓసారి నన్ను తన స్టూడియోకు ఆహ్వానించారు. ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన కుటుంబానికి, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా” – పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌

”పద్మవిభూషణ్‌ రామోజీరావు మరణం తీవ్ర విచారకరం. మీడియా, జర్నలిజం, సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నా” – తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌

- Advertisement -

అమిత్ షా..

”మీడియా దిగ్గజం, ప్రముఖ పారిశ్రామికవేత్త రామోజీరావు మరణం విచారకరం. మీడియా నుంచి ఫైనాన్స్‌ వరకు.. విద్య నుంచి పర్యాటకం వరకు తాను పనిచేసిన అనేక రంగాల్లో తన సృజనాత్మకతతో ఎన్నో సానుకూల ప్రమాణాలను తీసుకొచ్చారు. ఇప్పుడు భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన కృషి తరతరాలకు స్ఫూర్తినిస్తుంది. ఈ విచారకర సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నా – అమిత్ షా

Advertisement

తాజా వార్తలు

Advertisement