Monday, December 23, 2024

TG | సినీ ప్రముఖుల ఇళ్లపై దాడిని ఖండిస్తున్నా : సీఎం రేవంత్

జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా ట్వీట్ చేశారు.

శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్ ను ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి..

కాగా, ఈరోజు సాయంత్రం అల్లు అర్జున్ ఇంటి కాంపౌండ్ వాల్ ఎక్కి… విద్యార్థి సంఘాల నేతలు ఆందోళ‌న చేప‌ట్టారు. సంధ్య థియేటర్ ఘటనలో రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణం అంటూ నినాదాలు చేశారు. బన్నీ ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు.

- Advertisement -

రేవతి కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఇంటి వద్ద సెక్యూరిటీ వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా… కొందరు అల్లు అర్జున్ నివాసంపై రాళ్లు రువ్వారు.ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

రాళ్ల దాడిలో అల్లు అర్జున్ ఇంటి ఆవరణలోని పూల కుండీలు ధ్వంసమయ్యాయి. విద్యార్థి సంఘాల నేతల ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అల్లు అర్జున్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement