హైదరాబాద్ : ఉమ్మడి నల్గొండ జిల్లా సహా హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎక్కడిక్కడ అరెస్టులు చేయడాన్ని, గృహ నిర్భంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ దాడులను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు అక్రమ అరెస్టులకు తెర లేపడం దుర్మార్గమని హరీశ్‌రావు మండిపడ్డారు. పోలీసు బలం ఉపయోగించి, ప్రతిపక్షాలను అణిచివేయాలని చూడటం అప్రజాస్వామికం. అక్రమ అరెస్టులు చేసిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు
- Advertisement -