5 శాతం శ్లాబును పూర్తిగా ఎత్తేసే ఆలోచనలో జీఎస్‌టీ కౌన్సిల్ ఉన్నట్టు సంబంధిత అధికారి ఒకరు వివరించారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఉపయోగించే వస్తువులు చాలా వరకు 5 శాతం శ్లాబు పరిధిలో ఉన్నాయి. ఈ శ్లాబును ఎత్తేసి.. కొత్తగా 3 శాతం శ్లాబును తీసుకురావాలనే ఆలోచనలో జీఎస్‌టీ కౌన్సిల్ ఉన్నట్టు తెలుస్తున్నది. తక్కువగా ఉపయోగించే.. 5 శాతం పరిధిలోని వస్తువులు.. 8 శాతం శ్లాబులోకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఆదాయాలు పెంచేందుకు ట్యాక్స్ మినహాయింపు ఇస్తున్న వస్తువుల జాబితాను కుదించనున్నట్టు తెలుస్తున్నది. 5 శాతం శ్లాబ్‌లోని వస్తువులు.. 8 శాతం శ్లాబులోకి వెళ్తే వాటి ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
5 శాతం శ్లాబ్ రేటు ఒక్క శాతం పెరిగినా.. ప్రభుత్వానికి అదనంగా రూ.50వేల కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఈ 5 శాతం పరిధిలోని చాలా వస్తువులు ఏకంగా 8 శాతం శ్లాబులోకి తీసుకెళ్లాలని జీఎస్‌టీ మండలి భావిస్తున్నది. జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రుల బృందం వచ్చే నెల ప్రారంభంలో మార్పులకు సంబంధించిన సిఫార్సులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక తుది నిర్ణయం కోసం మే మధ్యలో జరిగే తదుపరి సమావేశంలో కౌన్సిల్ ముందు ఉంచబడుతుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..