Wednesday, November 20, 2024

డయాలసిస్‌పై సమగ్ర సమాచారం.. తెలంగాణకు చెందిన హరికుమార్ రచించిన పుస్తక ఆవిష్కరణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: డయాలసిస్‌పై సమగ్ర సమాచారంతో రూపొందించిన పుస్తకం అందుబాటులోకి వచ్చింది. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన రాగి హరికుమార్ న్యూఢిల్లీలోని ఆర్‌ఎంఎల్ ఆసుపత్రిలో సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నారు. తన తల్లి రాగి భాగ్యలక్ష్మి జ్ఞాపకార్థం రచించిన “గైడ్‌లైన్స్ టు డయాలసిస్ థెరపీ టెక్నాలజిస్ట్స్” అనే పుస్తకాన్ని ప్రముఖ నెప్రాలజిస్టులు డాక్టర్ సందీప్ గార్గ్, డాక్టర్ హిమాన్షు వర్మ ఆవిష్కరించారు.

ఇండిషన్ అసోసియేషన్ ఆఫ్ డయాలసిస్ టెక్నాలజీ ( ఐఏడీటీ ) – 2023, 4వ జాతీయ సదస్సు మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో రెండు రోజుల పాటు జరిగింది. దేశం నలుమూలల నుంచి ప్రముఖ వైద్యులు, 450 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. డయాలసిస్ టెక్నాలజిస్టుల కోసం సైంటిఫిక్ సెషన్‌లు, ప్రముఖ వక్తలతో చర్చలు నిర్వహించారు. డయాలసిస్‌కు సంబంధించి సమగ్ర సమాచారంతో రాగి హరికుమార్ రచించిన పుస్తకాన్ని ఈ సదస్సులో ఆవిష్కరించారు. రాగి హరికుమార్ జాతీయ స్థాయి ఐఏడీటీకి జనరల్ సెక్రటరీగా కూడా వ్యవహరిస్తున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement