Sunday, November 17, 2024

TG | జోరందుకున్న సమగ్ర కుటుంబ సర్వే.. ఇప్పటివరకు 58.3 శాతం పూర్తి !

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే విజయవంతంగా సాగుతోంది. ఇందుకు సంబంధించి ప్రతిరోజూ అన్ని జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తున్నారు. అధికారిక సమాచారం ప్రకారం ఆదివారం సాయంత్రం నాటికి 58.3 శాతం ఇంటింటి సర్వే పూర్తయింది. నవంబర్‌ 6న ప్రారంభమైన ఈ సర్వే.. 12 రోజుల్లోనే సగానికిపైగా పూర్తయింది.

మొత్తం రాష్ట్రంలో ఇప్పటివరకు 67,72,246 గృహాల సర్వే పూర్తయింది. జిల్లాల వారీగా సర్వే పురోగతిలో ములుగు (87.1శాతం), నల్గొండ (81.4శాతం) జిల్లాలు ముందంజలో ఉన్నాయి. అలాగే జనగామ (77.6శాతం), మంచిర్యాల (74.8శాతం), పెద్దపల్లి (74.3శాతం) తర్వాత వరుసలో ఉన్నాయి. జన సాంద్రత ఎక్కువగా ఉన్న గ్రేటర్‌ హైదరాబాద్‌ సిటీ-లో 38.3శాతం సర్వే పూర్తయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement