Saturday, November 23, 2024

సంక్లిష్టంగా వైద్యవృత్తి.. ప్రెషర్ కు గురవుతున్న డాక్టర్లు: గవర్నర్ తమిళిసై సౌందర రాజన్

హైదరాబాద్‌, ప్రభ‌న్యూస్: వైద్యుల్లో 8 నుంచి 38శాతం మంది తమవృత్తిలో ఏదో ఒక సమయంలో శారీరకంగా గాని, మానసికంగా గాని హింసను ఎదుర్కొంటున్నారని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ముఖ్య కారణంగా వైద్యులు-రోగుల మద్య కమ్యూనికేషన్‌ సరిగ్గా లేకపోవడమేనని స్పష్టం చేశారు. తాను తంజావూరు మెడికల్‌ కాలేజీలో విద్యార్థిగా ఉన్నపుడు ఓ రోగి గుండెజబ్బుతో బాదపడుతున్నా…అతడికి వైద్యులు చెప్పకపోవడంతో ఉదయం నుంచి మలబద్దకం కావడం లేదని, తన వ్యాధి అదేనని భావించాడని వివరించారు. రోగులకు అర్థమయ్యే విధంగా వారికి వ్యాధి, పరీక్షల గురించి వివరించాలని, అప్పుడే వైద్యులపై హింసాత్మక ఘటనలు తగ్గుతాయన్నారు.

ఈ మేరకు ఆపోలో ఆసుపత్రి నిర్వహించిన కమ్యూనికాన్‌-2021 సదస్సును నిన్న‌ ఆమె ప్రారంభించి మాట్లాడారు. జాతీయ కుటుంబ సంక్షేమశాఖ, ఇండియన్‌ నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి. భాతర ప్రభుత్వ ఎన్‌బీఇఎంఎస్‌ అధ్యక్షుడు డా.అభిజిత్‌ శేత్‌, అపోలో ఆసుపత్రుల అధ్యక్షుడు కే.హరిప్రసాద్‌, కాడిలా ఫార్మా ఎండీ రాజీవ్‌ మోడీ పాల్గొన్నారు. వైద్యులు రోగుల మధ్య కమ్యూనికేషన్‌ మౌఖింగా, మాటల ద్వారా, సంజ్ఞల ద్వారా కొనసాగించాలన్నారు. రోగికి చికిత్స సమయంలో వైద్యుడి బాడీ లాంగ్వేజ్‌ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుందని గుర్తు చేశారు. ఆరోగ్య సంరక్షణలో కమ్యూనికేషన్‌ అనేది కీలకమని నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ అధ్యక్షుడు డా. అభిజాత్‌ శేత్‌ అన్నారు.

గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement