Saturday, November 23, 2024

నకిలీ చేనేతపై ఈడీకి ఫిర్యాదు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: నకిలీ చేనేత వస్త్రాలను విచ్చలవిడిగా అమ్ముతున్న వారిపై చర్యలు చేపట్టాలంటూ బీసీ రాజ్యాధికార సమితి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఫిర్యాదు చేసింది. మిల్లు వస్త్రాలను చేనేత అని చెబుతూ నేత కళాకారుల కష్టాన్ని దోచేస్తూ, వినియోగదారులను మోసం చేస్తున్న వ్యవహారంపై సమితి అధ్యక్షుడు దాసు సురేష్ బుధవారంలో ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. చేనేత పేరుతో ఒకే యాజమాన్యం వివిధ పేర్లతో షాపింగ్ మాల్స్‌ను ఏర్పాటు చేసి ఇన్‌సైడ్ ట్రేడింగ్‌కు పాల్పడుతోందంటూ అందుకు సంబంధించిన వివరాలను ఫిర్యాదులో పేర్కొన్నారు.

నకిలీ ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు, హస్తకళలతో అంతర్జాతీయ మార్కెట్‌లోనూ భారత్ పేరు చెడగొడుతున్నారని సురేష్ అన్నారు. తమ శ్రమకు తగిన గిట్టుబాటు ధర రాక, అసహజ మార్కెట్ పోటీని తట్టుకోలేక చేనేత కార్మికులు విలవిల్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. దీనివల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోతున్నాయని తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement