పీసీసీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు రేవంత్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు రాష్ట్ర డీజీపీ అనిల్ కుమార్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బుధవారం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టి. రవీందర్ రావు, ఎల్.రమణ, తాతా మధు, శంభిపూర్ రాజు, దండె విఠల్ కలిసి డీజీపీ కార్యాలయానికి వెళ్లి డీజీపీని కలిశారు. నిన్న ములుగు పాదయాత్రలో భాగంగా టిపిసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ను పేల్చేయాలని, బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ఉద్దేశించి పరుష పదజాలంతో చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికాదన్నారు. ముఖ్యమంత్రి పరిపాలనా కార్యాలయం, నివాసాన్ని గ్రైనైడ్స్ పెట్టి పేల్చి వేయాల్సిందిగా కోరడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. చట్ట సభల్లో సభ్యుడిగా ఉండి అధికార భవనాలను కూల్చివేయాల్సిందిగా కోరడమంటే, ఖచ్చితంగా ఇది చట్ట వ్యతిరేక చర్యగా భావించాలని కోరారు. రేవంత్ ప్రసంగాన్ని పరిశీలించి చట్టపరమైన చర్యలను వెంటనే తీసుకోవాలని డీజీపీని కోరారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement