Monday, November 18, 2024

ఇండియా మ్యాప్ వివాదం.. ట్విట్టర్ ఎండీపై కేసు నమోదు

భారత్ మ్యాప్‌ను తప్పుగా చూపినందుకు ట్విట్టర్ ఎండీపై కేసు నమోదైంది. భజరంగ్ దళ్ నేత ప్రవీణ్ భాటి ఫిర్యాదు మేరకు ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరితో పాటు న్యూస్ పార్ట్‌నర్ షిప్స్ హెడ్ అమృతా త్రిపాఠిపైనా ఉత్తరప్రదేశ్‌లోని ఖుజ్రానగర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఓ వ్య‌క్తిపై దాడి ఘటనలో మ‌నీశ్ మ‌హేశ్వ‌రిపై ఇప్ప‌టికే యూపీలో ఓ కేసు నమోదై ఉంది. ఈ కేసులో అరెస్ట్ కాకుండా ఆయ‌న ముంద‌స్తు బెయిల్ తెచ్చుకున్నారు.

జమ్మూ కాశ్మీర్, లడాఖ్‌లను వేరే దేశంగా ట్విట్టర్ చూపించడంపై సోషల్ మీడియాలో నెటిజన్‌లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పైగా స‌గ భాగాన్ని చైనాకు చెందిన ప్రాంతంగా ట్విట్టర్ ప్ర‌ద‌ర్శించింది. దీన్ని గుర్తించిన నెటిజ‌న్లు ట్విట్ట‌ర్‌ను తీరును ఏకిపారేశారు. కేంద్ర హోంశాఖ‌ను ల‌క్ష‌లాది మంది ఫిర్యాధులు చేశారు. దీంతో ఆల‌స్యంగా ఆ చిత్రాన్ని తొల‌గించింది ట్విట్ట‌ర్. ఇప్ప‌టికే కొత్త ఐటీ చ‌ట్టం విష‌యంలో కేంద్రం, ట్విట్ట‌ర్ మ‌ధ్య వివాదం న‌డుస్తోంది. ఈ క్ర‌మంలో ట్విట్ట‌ర్ చేసిన త‌ప్పిదంపై గ‌ట్టి చ‌ర్య‌లే ఉంటాయ‌ని అంద‌రూ భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ట్విట్టర్ నిర్వాకం.. వేరే దేశంగా లడాఖ్

Advertisement

తాజా వార్తలు

Advertisement