Tuesday, November 19, 2024

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఈవీ, దిగ్గజ కంపెనీలకు పోటీ.. ఎండీ సిద్దార్థ లాల్‌ ప్రకటన..

ఎలక్ట్రిక్‌ కార్లు, ద్వి చక్ర వాహనాల సేల్స్‌ భారీగా పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా వీటికి ఆదరణ పెరుగుతున్నది. ఇలాంటి సమయంలో.. రాయల్‌ ఎన్‌ ఫీల్డ్‌ ప్రియులకు ఆ సంస్థ తీపి కబురు అందించింది. ఈ మేరకు కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సిద్దార్థ లాల్‌ కీలక ప్రకటన చేశారు. హీరో, అథేర్‌, బీఎండబ్ల్యూతో ఈవీ రంగంలో పోటీ పడేందుకు సిద్ధమైనట్టు తెలిపారు. ఎలక్ట్రిక్‌ బైక్‌ను విడుదల చేస్తామని, ఇందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. ఇప్పటికే టాప్‌ కంపెనీలు మేలో ఎలక్ట్రిక్‌ బైక్‌ను తీసుకొచ్చే పనిలో బిజీగా అయిపోయాయి.

చెన్నై కేంద్రంగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ తయారు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే దిచక్ర వాహన ఆటో మొబైల్‌ సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌ల కోసం ప్రొటోటైప్‌లను సిద్ధం చేస్తుందని, త్వరలో ఈవీ బైక్‌ తయారీని ప్రారంభించనున్నట్టు తెలుస్తున్నది. అయితే బైక్‌ 8 కేడబ్ల్యూహెచ్‌ నుంచి 10 కే డబ్ల్యూహెచ్‌ వరకు బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించే అవకాశాలున్నాయి.. ఎలక్ట్రిక్‌ దిచక్ర వాహనాల మార్కెట్‌లో ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ల ప్రకారం.. బైక్‌ల శక్తి, గరిష్ట టార్క్‌ 40 బీహెచ్‌పీ, 100 ఎన్‌ఎం ఉందని అంచనా.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement