Thursday, November 21, 2024

మంచి ప‌నుల్లో నాతో పోటీ ప‌డండి… మంత్రి కేటీఆర్

త‌న‌ మీద పోటీ చేయాలనుకునే ఇతర పార్టీలోని యోదాను యోధ నాయకులకు పిలుపునిస్తున్నా.. మంచిపనుల్లో త‌నతో పోటీ పడాల‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా రాజ‌న్న సిరిసిల్ల‌ జిల్లాలోని ఇంటర్ విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… జిల్లాకు ఎన్నో ప్రభుత్వ విద్యాసంస్థల్ని సాధించుకున్నామన్నారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమ‌న్నారు. జిల్లాలో ఉన్న సిరిసిల్ల వేములవాడ.. రెండు నియోజకవర్గాల అభివృద్ధికి త‌న శాయ శక్తులా కృషి చేస్తున్న అన్నారు. నాయకుల పుట్టినరోజు వేడుకల పేరుతో అనవసరపు ఖర్చులు చేస్తున్నారన్నారు.

ఒక చిన్న పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా 120 అంబులెన్స్ లు సమకూరాయ‌న్నారు. దివ్యాంగుల‌కు 1200 ద్విచక్ర వాహనాలు రాష్ట్రవ్యాప్తంగా అందించామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న 6000 మంది ఇంటర్ విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ చేస్తున్నామ‌న్నారు. విద్యార్థులకు ట్యాబ్ లు అందజేయడానికి తోడ్పడిన బైజూస్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసుకుంటున్నామన్నారు. విద్యార్థులకు విద్యలో ఇబ్బందులు కలగకుండా విద్యా ప్రమాణాలు పెంచుకుంటూపొతున్నామన్నారు. కొత్త ఆలోచనలతో పైకి ఎదగాలని తపన వున్న విద్యార్థులకు కచ్చితంగా ప్రోత్సాహమిస్తామ‌న్నారు. విదేశాల విద్య కోసం ఓవర్సీస్ స్కాలర్ ఫిప్ రూ.20 లక్షలు ఇచ్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలంగాణ ప్రభుత్వమేన‌న్నారు. విద్యా, విజ్ఞానానికి మించిన సంపద ఇంకోటి లేదన్నారు. ఎన్నికల అనవసర ఖర్చులు పెడుతూ డబ్బును వృధా చేయకుండా, ప్రజా ప్రతినిధులు మంచి పనులు చేస్తూ ఉండాల‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement