మహారాష్ట్రలో ఎక్కడి నుంచే సరే తనపై ఎన్నికల్లో పోటీ చేయాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు ఎంపీ నవనీత్ కౌర్ సవాల్ విసిరారు. ఆయనకు మహిళల సత్తా ఏంటో చూపిస్తానని పేర్కొన్నారు. ”హనుమాన్ చాలీసా చదవడమే నేరమా? శ్రీరామ నామాన్ని తలచినందుకు 14రోజులు జైల్లో పెట్టారు. అదే నేరమైతే 14 రోజులు కాదు 14ఏళ్లు జైల్లో ఉంటా” అని తెలిపారు. హనుమాన్ చాలీసా వివాదంలో అరెస్టు అయి విడుదలైన అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడారు.
”మహారాష్ట్రలో శాంతిభద్రతలు లేవు. మహిళలు అణచివేతకు గురవుతున్నారు. నాపై చాలా క్రూరమైన కుట్రలు పన్నారు. బాధపడుతున్నా. వైద్యులను అభ్యర్థించి డిశ్చార్జ్ అయ్యా, ఉద్ధవ్‌థాకరే ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తా” అని నవనీత్ కౌర్ స్పష్టం చేశారు. శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ… ఆయన ఓ చిలుక అంటూ కౌర్ అభివర్ణించారు. సంజయ్ రౌత్‌పై ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..