Saturday, November 23, 2024

కామన్‌ యూనివర్శిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. జులైలో సీయుఈటీ ఎంట్రెన్స్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ యూనివర్శిటీల్లో అండర్‌గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న కామన్‌ యూనివర్శిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సీయుఈటీ)-2022 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈమేరకు బుధవారం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ బుధవారం నుంచే ప్రారంభవగా, మే 6 వరకు కొనసాగనుందని ఎన్‌టీఏ తెలిపింది. జులై మొదటి లేదా రెండో వారంలో సీయుఈటీ ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొంది. మొత్తం 13 భాషల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది.

విదేశాల్లో ఉండే అభ్యర్థుల కోసం పరీక్ష కేంద్రాలను 13 దేశాల్లోనూ ఏర్పాటు చేసినట్లు ఎన్‌టీఏ తెలిపింది. జనరల్‌, అన్‌ రిజర్వ్‌డ్‌ కేటగిరీ విద్యార్థులకు దరఖాస్తు ఫీజు రూ.650, జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌, ఓబీఎస్‌ నాన్‌ క్రిమిలేయర్‌కు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, థర్డ్‌ జెండర్‌కు రూ.550 ఫీజుగా నిర్ణయించారు. దరఖాస్తు చేసుకోవడానికి, ఇతర వివరాలకు సీయుఈటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement